Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతులు సంఘటితం కావటం ద్వారా ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పిలుపునిచ్చారు. జిల్లాలో 80 శాతానికి పైగా సన్న, చిన్నకారు రైతులు ఉన్నారన్నారు. వారు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందేందుకు విడివిడిగా మార్కెట్లో అమ్మటం కాకుండా, సమిష్టిగా ఉత్పత్తులను అమ్మినట్లైతే లాభదాయకంగా ఉంటుందన్నారు. బుధవారం లక్ష్మీదేవిపల్లిలోని లోతువాగు రైతు వేదికలో జరిగిన అవగాహనా సదస్సులో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, వ్యవసాయ అధికార్లు, బ్యాంకు అధికారులతో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక్వీటీ గ్రాంటు పథకం ద్వారా రైతు ఉత్పత్తి దారుల కంపెనీలకు రైతులు తమ వాటా దారుల సభ్యుల ఈక్విటీ కంట్రిబ్యూషన్‌కు సమానమైన గ్రాంటును రెండు విడతల్లో గరిష్టంగా రూ.5లక్షల వరకు ఉందన్నారు. ఎస్‌ఎఫ్‌ఏసీ పథకం నిబంధనలు అనుగుణంగా క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పథకమని తెలిపారు. ఈ సభలో రైతు ఉత్పత్తు దారుల సంఘాల నుండి వచ్చిన రైతులు కృష్ణారావు మాట్లాడుతూ సంఘాలకు రైతు వేదికల్లో అవగాహనా సదస్సులు నిర్వహించాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు మాట్లాడుతూ.. జిల్లాలో రైతులందరు ప్రభుత్వం నుండి అమలు అవుతున్న వివిధ పథకాల వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల నుండి తెలుసుకుని లబ్ది పొందాలని కోరారు. జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాజి రెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల నుండి వివిధ రకాల రుణాలు పొందడం ద్వారా బ్యాంకుల వ్యవసాయ అభివృద్ధికి పెంపొందించుకోవాలని రైతులను కోరారు. నాబార్డు మేనేజరు సుజిత్‌కుమార్ మాట్లాడుతూ నాబార్డు నుండి అమలవుతున్న వివిధ పథకాల గురించి వివరించారు. ఈ శిక్షణా అవగాహన కార్యక్రమంలో అగ్రికల్చరల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి కన్సల్టెంటు ప్రసన్న, రిసోర్సు పర్సన్ నాగ బ్రహ్మ చారి, ఉత్పత్తి దారుల సంఘాల నుండి రైతులు, ప్రతినిధులు, బ్యాంకు అధికార్లు, డివిజన్ల నుండి సహాయ వ్యవసాయ సంచాలకులు, వివిధ మండల వ్యవసాయ అధికార్లు పాల్గొన్నారు.