Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు సహకరించాలి : జిల్లా ఎస్పీ వినీత్
మణుగూరు : వలస ఆదివాసీ గ్రామాలకు మంచి నీరు, విద్యుత్, వైద్యం సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం అన్నివేళలా సహకరిస్తుందని జిల్లా ఎస్పీ వినీత్.జి అన్నారు. బుధవారం మణుగూరు మండలం బుగ్గ పంచాయతీ పరిధిలోని వలస ఆదివాసీ గ్రామమైన బుడుగుల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించి, బూస్టర్ డోస్‌ను వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసులు కరోనా, మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంచినీటి సమస్య తలెత్తకుండా వేసవికాలం లోపే బోర్వెల్ వేయిస్తామన్నారు. 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారికి అర్థగంటలో చేరుకునేందుకు రహదారి నిర్మిస్తామన్నారు. బుగ్గ గ్రామం నుండి బుడుగులకు విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుతం సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మావోయిస్టులు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. గ్రామాలలో రోడ్లు, బడులు కట్టలేదు కానీ వాటిని ధ్వంసం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. అమాయక గిరిజనులను లొంగదీసుకుని వారి చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి టి.సాయి మనోహర్, మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు, సిఐ ముత్యం రమేష్, ఏడూళ్ల బయ్యారం సీఐ రాజగోపాల్, అశ్వాపురం సిఐ శ్రీనివాసులు, సబ్ డివిజన్లోని ఎస్ఐలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.