Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక పోరాటాలకు వేదికగా ఖమ్మం నగరం
- సీఐటీయూ రాష్ట్ర కమిటీ నాయకులు ఎర్ర శ్రీకాంత్, బండి రమేష్
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
డిసెంబర్ 5, 6, 7 తేదీలలో ఖమ్మం నగరంలో జరుగుతున్న వ్యవసాయ కార్మికుల మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడం ద్వారా భవిష్యత్తు వ్యవసాయ కార్మిక పోరాటాలకు ఖమ్మం నగరం వేదికగానుందని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ పేర్కొన్నారు. స్థానిక త్రీ టౌన్ ప్రాంతంలోని వర్తక సంఘం కార్యాలయంలో నాయకులు భూక్య శ్రీనివాసరావు అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల నిర్వహణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ. మహాసభలు జయప్రదం లో కార్మిక వర్గం కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్ మాట్లాడుతూ.. మహాసభలు జయప్రదం కావడం అని అంటే భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవడం, రైతాంగం, వ్యవసాయ కార్మిక వర్గం, కార్మిక వర్గం మొదలగు అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి వేదికగా ఈ మహాసభలో నిలవనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో అనేక అభ్యుదయ వామపక్ష భావాలకి వేదికగా నిలిచి మహాసభలు నిర్వహించిన చరిత్ర ఉందని, ఖమ్మం ప్రజలకు ఆదరించిన ఘనత కూడా ఉందని పేర్కొన్నారు. ఈ మహాసభలలో కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయన్ తో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ రాష్ట్ర నాయకత్వం తెలంగాణ అన్ని జిల్లాల నుండి ప్రతినిధి వర్గం హాజరుకానున్నట్లు తెలిపారు. మహాసభలో జయప్రదంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో టియుడిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి తుషాకుల లింగయ్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ వివిధ ప్రజా సంఘాల నాయకులు గొడవర్తి నాగేశ్వరరావు, నండ్ర ప్రసాద్, కొమ్ము శ్రీను, అంగిరేకుల నరసయ్య, నందిగామ కష్ణ, బండారు యాకయ్య, కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, పత్తిపాక నాగ సులోచన, బండారు వీరబాబు, షేక్ హిమామ్, శీలం వీరబాబు, బజ్జూరి రమణారెడ్డి, పోతురాజు జార్జి, తదితరులు పాల్గొన్నారు.