Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. మండల పరిధిలో ఖానాపురం గ్రామపంచాయతీ నూతన భవనాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌తో కలిసి బుధవారం ఆయన లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. గ్రామాల్లో ఉన్న కార్యకర్తలే పార్టీకి పట్టుకొ మ్మలన్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే కాపాడుకో వాల్సిన బాధ్యత పార్టీ మర్చిపోవద్దన్నారు. పల్లెల్లో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. అనంతరం రూ.20 లక్షలతో నిర్మించనున్న సిసిరోడ్డు, డ్రైనేజ్‌లకు వారు శంకుస్థాపన చేశారు. తొలుత గ్రామ సర్పంచ్ మాలోజు ఉషాగోవిందు ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజులకు పూలతో ఘనస్వాగతం పలికారు. మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బతుకమ్మలను ఎత్తుకొని సభస్థలానికి చేరు కున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పిటిసి పసుపులేటి దుర్గావెంకట్, ఎంపీటీసీ సభ్యురాలు నానబాల మాధవికిరణ్ గ్రామ సర్పంచ్ మాలోజి ఉషగోవిందు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు గడ్డం వెంకట్,పోట్ల ప్రసాద్, పాము సిల్వరాజు, పండ్రేగు పల్లి గ్రామసర్పంచ్ ఓబినబోయిన అమరయ్య పాల్గొన్నారు.