Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితర నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలని ఖమ్మం నగరంలోని ఖానాపురం, వీడియోస్ కాలనీలో మరో రెండు వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం ఆయా మార్కెట్ నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజరు కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీడియోస్ కాలనీలో రూ.4.50కోట్లతో ఒక్కొక్కటి 2.01 ఎకరాల్లో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అందులో 65-వెజ్ స్టాల్స్, 23-ఫ్రూట్ స్టాల్స్, 46 నాన్-వెజ్ స్టాల్స్ మొత్తం-134 స్టాల్స్‌తో ఎర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజరు కుమార్, టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు,
రూ.1.80 కోట్లతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఖమ్మం :ఖమ్మం నగరంలో పలు డివిజన్లలో రూ.1.80 కోట్లతో నిర్మించనున్న సిసి సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ బుధవారం శంకుస్ధాపన చేశారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ దంసలాపురంలో రూ.45 లక్షలు, 18వ డివిజన్ సీతారామ నగర్ నందు రూ.45లక్షలు, 23వ డివిజన్ ముస్తఫా నగర్లో రూ.45 లక్షలు, 55వ డివిజన్ బ్యాంక్ కాలనీ మొత్తం రూ.1.90 కోట్లతో నిర్మించనున్న సిసి డ్రెయిన్స్ నిర్మాణ పలు డివిజన్లలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, కార్పొరేటర్లు మోతారపు శ్రావణి, మేడారపు వెంకటేశ్వర్లు, మక్బూల్, మందడపు లక్ష్మీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.