Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని గతంలో రజకులకు మున్నేరు పక్కన ధోబీఘాట్‌కు కేటాయించిన స్థలంను సర్వే చేయించి హద్దులు పెట్టించి రజకులందరికీ ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని కోరుతూ రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలోని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా నాయకులు రేగళ్ల సీతారాములు, రేగళ్ల కొండలు, జక్కుల వెంకటరమణ, నగర కన్వీనర్ కనతాల నరసింహా రావు మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న చెర్వు బజార్, రజక వీధీలలో రజక కమ్యూనిటీ భవన్లను పూర్తి చేయుటకు నిధులు కేటాయించాలని, ఖమ్మం ట్యాంక్ బండ్ మీద చిట్యాల ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని, రజకులకు డీసీసీబీ బ్యాంక్ ద్వారా వ్యక్తిగత ఋణాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో బట్టలు ఉతికే కాంట్రాక్టు రజకులకే ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాలలో ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులను వెంటనే మంజూరు చేయాలనా ్నరు. కరోనా సమయంలో సేవలందించిన రజకుల ను ప్రభుత్వం గుర్తించి వారిని గౌరవించాలని, ముదిరాజులను బీసీ'ఏ' చేర్చే ఆలోచనను ప్రభుత్వం విరమించు కోవాలనారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అను పదాన్ని వాడకుండా ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ పేరును వాడుకలోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు కండ్రాతి వెంకటేశ్వర్లు, తంగేళ్లపల్లి శ్రీనివాస్, పంతంగి రవికుమార్, రామారావు, కొలిపాక వెంకట్, గడ్డం ఉపేందర్, రేగుముడి రామకృష్ణ, వెంకన్న, కాకులహారం నరసింహా, వట్టికోట దర్గయ్య, యాలాద్రి, అప్పారావు, శ్రీను, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.