Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 గంటలు దాటితే ప్రాణాపాయానికి చాన్స్
- 30 ఏళ్ల నుంచే హెల్త్ చెకప్ కీలకం
- షుగర్ పేషెంట్లకు 25శాతం హృద్రోగాలు అధికం
- అక్షర గుండె ఆస్పత్రి వైద్యులు, ప్రముఖ కార్డియాలజిస్టు ఆళనే ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కోవిడ్-19 నాటి నుంచి గుండె మరింత ప్రమాదంలో పడిందని అక్షర గుండె ఆస్పత్రి డాక్టర్ ఆళనే ప్రవీణ్‌కుమార్ అన్నారు. గతంలో 45 ఏళ్ల పైబడితే హెల్త్చెకప్ల అవసరం ఉండేదని ఇప్పుడు 30 ఏళ్ల నుంచే ఆ పని చేయాలని సూచిస్తున్నారు. హార్ట్స్ట్రోక్ వచ్చిన ఆరు గంటల్లోపు ఆస్పత్రికి వస్తే ప్రాణాపాయం సంభవించే అవకాశాలు దాదాపు ఉండవని తెలిపారు. నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 'నవతెలంగాణ'తో బుధవారం ప్రత్యేకంగా మాట్లాడారు. కరోనా వచ్చిపోయిన వారిలో అత్యధికులు హృద్రోగాల బారిన పడుతున్నారన్నారు. శారీరక శ్రమ లేనివారు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పొగతాగే అలవాటు ఉన్నవారు 30 ఏళ్ల నుంచే హెల్త్‌చెకప్‌లు చేయించుకుంటే ఉత్తమమని సూచించారు. మధుమేహం బాధితులకు 25శాతం హృద్రోగాలు వచ్చే ప్రమాదం ఎక్కువని తెలిపారు. గుండెకు సంబంధించి ఎంత త్వరగా చెకప్ చేయిస్తే అంత ఉపయోగం అన్నారు. గుండెపో టుకు గురైన ఆరు గంటల్లోపు ఆస్పత్రికి వస్తే చికిత్స అనంతరం సాధారణ మనిషిలా తిరిగి వెళ్ల చ్చన్నారు. స్టంట్ ఫెయిల్ అవడం వంటివి ఉండవ న్నారు. ఎంత శాస్త్రసాంకేతికత అందుబాటులోకి వచ్చినా హార్ట్‌స్ట్రోక్‌కు గురైనప్పుడు సకాలంలో ఆస్పత్రికి రావడమే కీలకమన్నారు. ఆరు గంటల ో్లపు వస్తే ఎంతో సేఫ్ అని, 12-14 గంటలు దాటితే వైద్యం అందించినా ప్రాణాపాయం నుంచి కాపాడటం ఒక్కోసారి అసాధ్యమే అన్నారు. కరోనా తో రక్తానికి గడ్డకట్టే గుణం పెరుగుతుందని... సాధారణంగా రక్తం పలుచగా ఉంటేనే రక్తనాళాల ద్వారా గుండెకు సజావుగా సరఫరా జరగుతుందన్నారు. రక్తం ఉండాల్సిన దానికంటే కాస్త చిక్కబడినా రక్తపోటు అత్యంత వేగంగా పెరుగుతుందన్నారు. కరోనా వ్యాధిగ్రస్తుల్లో రక్తం గడ్డకట్టే గుణం ఎక్కువగా ఉంటుందన్నారు. వైరస్ సోకిన సమయంలోనే కాకుండా...నెగిటివ్ వచ్చాక కూడా కొద్దిరోజుల పాటు ఈ ప్రభావం ఉంటుందన్నారు. వైరస్ నుంచి బయటపడ్డాక గుండె ఆరోగ్యం ఎలా ఉందో పరీక్ష చేయించుకోవడం ఉత్తమం అన్నారు. ఈసీజీ, టూడీ ఎకో పరీక్షలు చేయించుకోవాలన్నారు. మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్త వహించాలన్నారు. కనీసం సంవత్సరానికి ఓ సారి వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదన్నారు.