Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
నాగులవంచ ఆదర్శ పాఠశాలలో బుధవారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిన్నారులు పట్టు వస్త్రాలను ధరించి బాగా ముస్తాబై తంగేడు, బంతి, చేమంతి పువ్వులతో బతుకమ్మలను తయారుచేసి గౌరమ్మను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ, ఆడుతూ చప్పట్లు కొడుతూ విద్యార్థునులు, ఉపాధ్యాయినులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుక కనులవిందుగా సాగింది. పాఠశాల కరస్పాండెంట్ బోడేపుడి కిరణ్కుమార్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణా స్త్రీలకు అతి ఇష్టమైన, ముఖ్యమైన పండుగ అని మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని, తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను ఆడుతారని, తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన ఈ పండుగను ప్రాచీనకాలం నుండి సాంప్రదాయకంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. మహిళలకే పరిమితమైన ఈ పండుగ ఒకరి మధ్య ఒకరికి స్నేహభావాన్ని పెంపొందించుకోవటానికి దోహదపడుతుందనీ, ఈ తరం విద్యార్థులకు మన సంస్కృతీ, సాంప్రదాయాలపట్ల గౌరవం మరియు అవగాహన కలిగించుటకు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్దులు పాల్గొన్నారు.