Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీరెల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట నర్సు
నవతెలంగాణ-ఇల్లందు
సంస్కృతి సాంప్రదాయాలు వెలుగెత్తే ఆడపడుచుల ఔన్నత్యాన్ని చాటే ప్రకృతి దేవత బతుకమ్మని సర్పంచ్ మూతి వెంకట నర్సు అన్నారు. మండలంలోని పూబెల్లి గ్రామ పంచాయతీ కేంద్రంలో బుధవారం పేదలకు చీరల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనంగా నిలుస్తోందన్నారు. కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే చెందిన పండుగని అన్నారు. ఎంతో కష్టపడి రకరకాల పూలు అన్నీ పేర్చి ముస్తాబై మహిళలు బతుకమ్మ ఆడతారని అన్నారు. ఈ సందర్భంగా పాడేపాటల్ని మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమలు, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర పురాణాలు పాటల వెనుక ఉన్న నేపథ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య, పాలకవర్గం సభ్యులు సిబ్బంది స్థానిక మహిళలు పాల్గొన్నారు.