Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీపీవో మంగతార - ఘనంగా పోషకాహారం మాసోత్సవాలు
- ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పౌష్టికాహారం తీసుకుంటేనే గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ టేకులపల్లి సీడీపీవో మంగతార అన్నారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక అంగన్వాడీ సూపర్ వైజర్ విజయకుమారి, ఏసీడీపీవో అరుణ కుమారి ఆధ్వర్యంలో పోషకాహారం మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు, ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య హాజరైనారు. ఈ సందర్భంగా మంగతార మాట్లాడుతూ.. మండలంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలకు సెప్టెంబర్ మాసమంతా పౌష్టికాహార వారోత్సవాలను నిర్వహించారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ప్రతి కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. అనంతపురం గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. పిల్లలకు అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టారు. తదనంతరం బతుకమ్మ ఆటపాటలతో సంబురాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ గొగ్గెల రామయ్య, ఎంపీడీవో మందా మంగమ్మ, డీటీ అనుష, సర్పంచ్ లు మెస్సు కోటేశ్వరరావు, పూనెం నిర్మల, ఉప సర్పంచ్ బుర్ర వినోద, సూపర్ వైజర్ లు లక్ష్మి, సక్కుబాయి, అనురాధ, రోజా కరుణ కుమారి, హెచ్.వీ లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సుజాత, బుచ్చమ్మ, మమత, పోషణ అభియాన్ నాగిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహారావు, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు రాంబాబు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.