Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాస్తారోకో చేసిన విలేకర్లు - అరగంట స్తంభించిన రాకపోకలు
- ఎస్ఐఎఫ్ఆర్ఒ చర్చలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండల పరిధిలోని వాగోడ్డు గూడెం గిరిజనులు స్థానికంగా ఉన్న పోడులో బుధవారం విత్తనాలు నాటుతున్నారు. విషయం తెలిసుకున్న ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రహ్మాన్ తన సిబ్బందితో పోడు భూమి వద్దకు వెళ్ళారు. ఈ సమాచారం అందిన పలువురు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కవరేజ్ చేయడం కోసమని వెళ్ళగా అందులో సంపత్ అనే అటవీ శాఖ ఉద్యోగి విలేకర్లు పట్ల హేళన చేస్తూ, కెమారాలను లాక్కోని దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహం చెందిన విలేకరులు ఫారెస్టు ఉద్యోగిపై ఎస్ఐ అరుణకు ఫిర్యాదు చేసారు. అనంతరం దాడిని నిరసిస్తూ మూడు రోడ్ల కూడలిలో గిరిజనులతో పాటు అరగంట రాస్తారోకో నిర్వహించారు. ఎస్ఐ అరుణ, ఎఫ్ఆర్వో వచ్చి విలేకర్లు ప్రతినిధులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.