Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ రేగా....
నవతెలంగాణ-మణుగూరు
మండలంలోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వంటగది భవనాన్ని, రోగులకు ఉచిత భోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయలు నిధులను కేటాయించి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తుందని అన్నారు. వంద పడకల ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. పినపాక నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వ వైద్యం తీసుకురావడంతో పాటు రాబోయే రోజులలో అదనంగా మరిన్ని ఆసుపత్రులు నిర్మాణం జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి కరస్పాండెంట్ పంచగిరి గిరిప్రసాద్, జడ్పిటిసి పోషం నరసింహారావు, మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, డాక్టర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.