Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భారత ఆహార సంస్థకు సీఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ సూచించారు. కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ చాంబర్లో అధికారులతో సిఎంఆర్ అందజేయడంపై అదనపు కలెక్టర్ గురువారం సమీక్షించారు. భారత ఆహార సంస్థకు సిఎంఆర్ నిర్ణీత కాలవ్యవధిలోగా అందించాలన్నారు. జిల్లాలో 1,96,000 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ కు గాను ఇప్పటివరకు 1,59,000 మెట్రిక్ టన్నులు (80%) అందించినట్లు, మిగులు 37,000 మెట్రిక్ టన్నులు మిల్లర్లు త్వరితగతిన అందజేయాలని తెలిపారు. మిల్లర్ల వారీగా కేటాయించిన లక్ష్యం మేరకు వెంటనే చర్యలు చేపట్టి సీఎంఆర్ అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సోములు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.