Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ బహిరంగ సభకు వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుగులోతు నరేష్ కోరారు. ఖమ్మం పట్టణంలో డిసెంబర్ 5,6,7 తేదీలలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం బోనకల్ మండలానికి చెందిన నాయకులు ఖమ్మం పట్టణంలో గురువారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర నాయకులు ఏడునూతల శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ప్రచారం ఖమ్మంలో విస్తృతంగా సాగుతుందన్నారు. ఖమ్మంలో మహాసభల సందర్భంగా సంస్కతిక, చారిత్రాత్మక పోరాటాలు ఉద్యమాల ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్మికులతో పాటు విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు, అభ్యుదయవాదులు ఈ మహాసభల జయప్రదం కోసం కృషి చేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బోనకల్ మండలానికి చెందిన రైతు సంఘం జిల్లా నాయకులు దొండపాటి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్, ఎల్ఐసి యూనియన్ నాయకులు తెల్లాకుల శ్రీనివాసరావు, గోవిందాపురం ఎల్ గ్రామపంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కారుంగుల చంద్రయ్య, మండల నాయకులు కోట కాటయ్య, సిఐటియు నాయకులు గీత కార్మిక సంఘం మండల నాయకులు పెద్దప్రోలు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.