Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధిర నుండి రోజుకు మూడు ట్రిప్పుల బస్సు సౌకర్యం
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర డిపోల నుండి ఒక బస్సు నడపడం లేదని ''ఆలయానికి ఆంధ్ర బస్సులే గతి'' అంటూ బుధవారం నవ తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి మధిర డిపో ఆర్టీసీ అధికారులు స్పందించారు. మధిర నుండి వయా ఎర్రుపాలెం, జమలాపురం, మీదగా మైలవరం వరకు రోజుకు మూడు ట్రిప్పులు బస్సును ఏర్పాటు చేశారు. నవతెలంగాణలో కథనం వచ్చిన మరుసటి రోజే బస్సును ఏర్పాటు చేయడంతో ప్రజలు నుండి మంచి స్పందన కనిపించింది. ఈ సందర్భంగా ప్రయా ణికులు మాట్లాడుతూ గతంలో మధిర నుండి వయా జమలాపురం, మైలవరం మీదగా నూజివీడు వరకు బస్సు నడిపే వారని, గతంలో లాగా నూజివీడు వరకు ఈ బస్సును పొడిగించాలని ప్రయాణికులు కోరారు. నూజివీడు వరకు ఈ బస్సును పొడిగించినచో ఆదాయం కూడా ఉంటుందని, ఆంధ్ర ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని వారు తెలిపారు. దీనితో పాటు మదిర నుండి వయా జమలాపురం, మైలవరం, మీదగా విజయవాడ వరకు ఒక బస్ సర్వీస్‌ని ఏర్పాటు చేయాలని ప్రయాణికులతో పాటు ఆలయానికి వచ్చే భక్తులు కోరుతున్నారు.