Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యానికి బడ్జెట్లో అధిక నిధులు
- ప్రపంచ హృదయ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ- ఖమ్మం
ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుందని, ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం ఖమ్మంలోని ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎర్పాటు చేసిన గుండె సంబంధిత క్యాంపను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న జీవన విధానం వల్ల గుండె సమస్యలు అధికంగా పెరుగుతున్నాయని అన్నారు. దీనికి ప్రధాన కారణం మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లే అని గుండె సంభందిత వైద్యులు చెబుతున్నారని వివరించా రు. ముఖ్యమ ంత్రి కేసీఅర్కి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఖమ్మం జిల్లాకు మెడికల్ ఆసుపత్రి మంజూరు చేశారని, వచ్చే సంవత్సరం నుండి ఇక్కడ నుండి తరగతులు ప్రారంభం అవుతాయని, కేసీఅర్ ముందు చూపుతో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ను మంజూరు చేశారని అన్నారు. ఒకప్పుడు పెద్ద ఆపరేషన్ కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సివచ్చేదని, కానీ నేడు ఖమ్మం లోనే అన్ని సర్జరీలు, బైపాస్ సర్జరీ తో సహా అన్ని వైద్య చికిత్సలు పూర్తి ఉచితంగా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు , జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా కలెక్టర్ వి.పి గౌతం, డిఎంఅండ్‌హెచ్‌వో మాలతీ, ఆసుపత్రి సూపరింటె ండెంట్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో బి.శ్రీనివాసరావు, డైటీషన్ మేరీ, నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ పాల్గొన్నారు.