Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరంలో పలు డివిజన్లలో రూ.1.71 కోట్లతో నిర్మించనున్న సిసి సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం శంకుస్ధాపన చేశారు. ఖమ్మం నగరంలోని 21వ డివిజన్ పార్శిబందంలో రూ.45 లక్షలు, 41వ డివిజన్ సీక్వెల్ రోడ్లో రూ.45లక్షలు, 58వ డివిజన్ రాపర్తి నగర్ 2 లో రూ.45 లక్షలు, 50వ డివిజన్ ఆర్టీసి కాలనీలో రూ.45లక్షలు, మామిళ్లగూడెంలో రూ.11.93లక్షలతో నిర్మించనున్న సిసి సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు, 41వ డివిజన్లో రూ. 24.25 లక్షలతో లకారం ట్యాంక్ బండ్ నిర్మించిన రెండవ గేట్, సిసి మెట్లు, ర్యాంపును ప్రారంభించారు. మొత్తం రూ.1.71కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణా, ఆళ్ల నీరిషారెడ్డి, దోరేపల్లి శ్వేత, రాపర్తి శరత్ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.