Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశానికి ముప్పు బిజెపి
- వెంకట్రామయ్య సంస్మరణ సభలో నున్నా, పొన్నం
నవతెలంగాణ-ఎర్రుపాలెం
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ ప్రజల హక్కులను కాల రాస్తుందని, కమ్యూనిస్టు పార్టీలు చట్ట సభలలో ఉండాలని ఇతర పార్టీలతో పాటు ప్రజలు కోరుకుంటున్నారని, ఎర్రజెండాని మరింత ఎరుపెక్కించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బనిగండ్లపాడు గ్రామానికి చెందిన పార్టీ మండల కమిటీ సభ్యులు పెరుమాళ్ళ వెంకటరామయ్య సంస్మరణ సభను మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య అధ్యక్షతన నిర్వహించారు. తొలుత వెంకట్రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ రంగాలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ప్రభుత్వరంగ ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తోందన్నారు. కార్పొరేట్ మిత్రుల లాభాలే ఏజెండాగా ప్రధాని మోడీ పని చేస్తున్నారని విమర్శించారు. బిజెపి లాంటి మతతత్వ పార్టీని అడ్డు కోవటమే సిపిఎం లక్ష్యమని, కమ్యూనిస్టులు చట్ట సభలలో ఉండకూడదని కార్పోరేట్ శక్తుల ఆశయమని, ఆ ఉద్దేశంతోనే వేల కోట్ల రూపాయల డబ్బు సంచులు పంపించి కమ్యూనిస్టుల ఓటమికి కృషి చేస్తున్నారని విమర్శించారు. మతోన్మాద బిజెపిని ఓడించే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కారం ప్రాతిపదికన మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు మన మధ్యన వెంకటరామయ్య లేకపోవడం చాలా బాధా కరమని, పార్టీకి తీరని లోటని అన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేశారని, సిపిఎం సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేశారన్నారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎర్రమల శ్రీనివాసరెడ్డి, గామాసు జోగయ్య, గొల్లపూడి వెంకటేశ్వరరావు, నల్లమోతుల హనుమంతరావు, సగుర్తి సంజీవరావు, నాగులవంచ వెంకట్రామయ్య, నాగులు మీరా, ఆంగోతు వెంకటేశ్వర్లు, మేడగాని తిరుపతిరావు, తోట సాంబశివరావు, కోలా రాములు, కూడెల్లి నాగేశ్వరరావు, గౌర్రాజు రాములు, ఎర్రమల వెంకటనారాయణరెడ్డి, బండారు ఉపేంద్ర, నాగరాజు, చిత్తారు కిషోర్, బుర్రి రవికుమార్, బిక్షాలు, కుర్ర వెంకటరామయ్య, షేక్ మొహిద్దిన్, పార్టీ నాయకులు, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.