Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛభారత్ సర్వేక్షణ్ జాతీయ స్థాయి అవార్డు
- జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య,
- కలెక్టర్‌ను సన్మానించిన ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య అన్నారు. గురువారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన జడ్పీ సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే పోడు సమస్య సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. డిడిలు చెల్లించిన రైతులకు సకాంలో పామాయిల్ మొక్కలు సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యాన అధికారిని ఆదేశించారు. అనంతరం స్వచ్ఛభారత్ సర్వేక్షణ్ జాతీయ స్థాయిలో మన జిల్లాకు మూడవ స్థానం రావడం పట్ల ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ సిబ్బందిని వారు అభినందించారు. ఈ నెల 2వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అవార్డు అందుకోనున్నారని చెప్పారు. ఈ అవార్డు మన జిల్లా ప్రజల సమిష్టి కృషికి దక్కిన గౌరవమన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మెన్ కనకయ్య జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ప్రజా ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ మట్లాడుతూ పోడు భూముల సమస్య పరిష్కారానికి ఎస్ఆర్సి కమిటీలను 'నియమించినట్లు తెలిపారు. జిల్లాలోని 343 గ్రామ పంచాయతీల పరిధిలోని 726 హాబిటేషన్లులో నెలకొన్నట్లు చెప్పారు. మానవాళి మనుగడకు అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చిన్న అడవులను కాపాడుకుంటూనే పోడు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. చండ్రుగొండ ఎస్సీ వసతిగృహాంలోని వర్షపునీరు చేరిందని, సమస్య పరిష్కారానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేసి సమస్య శాశ్వత పరిష్కారానికి చేపట్టు చర్యలపై నివేదికలు అందచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి రంజిత్ కుమార్్, జడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జడ్పీ సిఈఓ మెరుగు విద్యాలత, డిప్యూటి సిఈఓ నాగలక్ష్మి, జిల్లా అధికారులు, జడ్పీటిసిలు, ఎంపీపీలు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.