Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఈబీసీడబ్ల్యూఏ టీఎస్ జెన్కో సెక్రెటరీ రమాకాంత్
- కేటీపీఎస్ 5 6 దశల చీఫ్ ఇంజనీర్ కు మెమోరండం
నవతెలంగాణ-పాల్వంచ
విద్యుత్ సంస్థల్లో బీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జెన్కో సెక్రెటరీ ఆడేపు రమాకాంత్ అన్నారు. ఈ మేరకు గురువారం కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ఐదు ఆరు దశల చీఫ్ ఇంజనీర్ కె.రవీంద్ర కుమార్‌ను కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా ప్రారంభ దశలో ఏదైనా ఉద్యోగంలో 2009 నుండి నేరుగా నియమించబడిన ఉద్యోగుల యొక్క అంతర్గత సీనియార్టీ తదుపరి ప్రమోషన్‌కు సంబంధిత పోటీ పరీక్షల్లో పొందిన మెరిట్ ఆధారంగా నిర్ధారించి విద్యుత్ బోర్డు సర్వీస్ రెగ్యులేషన్లు ప్రభుత్వ ఉత్తర్వులు సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే అన్ని కేటగిరీలో సీనియార్టీలను ప్రకటించి ప్రమోషన్ కల్పించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ విద్యుత్ సంస్థల్లో జూన్ 2, 2014 నుండి కల్పించిన పదోన్నతులను వెంటనే సమీక్షించి నష్టపోయిన బీసీ ఉద్యోగులకు ఇంజనీర్లకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిష్కరించని ఎడల తెలంగాణ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్‌కో జెన్కో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ లో పనిచేస్తున్న వేలాది మంది బీసీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలను పూనుకొని చివరికి నిరవదిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె రవీందర్, లైజర్ ఆఫీసర్ హరికృష్ణ, కోశాధికారి ఎల్.వినోద్ బాబు, రీజినల్ సెక్రెటరీ గడ్డి ఐలయ్య, బ్రాంచ్ ప్రెసిడెంట్ రాంబాబు, సెక్రెటరీ అనిల్ కుమార్, తోట వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, బ్రహ్మం దేవేందర్, అనిల్ సాంబయ్య, నరేందర్ సీతయ్య, శోభన్ బాబు సురేందర్, శ్రీనివాస్ లతోపాటు 50 మంది పాల్గొన్నారు.