Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజు రెండు...
- సొమ్మసిల్లిన మహిళలు..
నవతెలంగాణ - అశ్వారావుపేట
మండలంలోని అటవీ ప్రాంతంలో పోడు వివాదం రగులుతుంది. రెడ్డిగూడెం లో మొదలైన వివాదం దురదపాడు, గాండ్లగూడెం, వాగొడ్డుగూడెం లకు విస్తరించింది. బుధవారం సంబవించిన వాగొడ్డుగూడెంలో వివాదం విలేకర్లు ను తాకింది. ఇది కాస్తా రాజకీయం పులుముకుంటుంది. అటవీ శాఖ క్షేత్రస్థాయీ సిబ్బంది అత్యుత్సాహం కాస్తా విలేకరి పై దురుసు ప్రవర్తనతో ఆ శాఖ ఉన్నతాధికారులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ విషయం గురువారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జర్నలిస్ట్ సంఘం నాయకులు ద్వారా కలెక్టర్ అనుదీప్ కు చేరింది. ఇదిలా ఉండగా రెండో రోజు వాగొడ్డుగూడెంలో గిరిజనులు పోరులో విత్తనాలు నాటు తుండగా ఫారెస్ట్ అధికారులు చుట్టుముట్టారు. దీంతో ఎస్.ఐ సాయి కిషోర్ రెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింప జేశారు.ఈ క్రమంలో పలువురు మహిళలు స్ప్రహతప్పి పడిపోయారు. విలేకరిపై దాడిని నిరసిస్తూ అశ్వారావుపేటలోని నాలుగు క్లబ్‌ల అధ్యక్షకార్యదర్శులు ఐక్య కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేసారు. స్థానిక మండల పరిషత్ సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎం.పి.పి శ్రీరామమూర్తి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ ఎన్డీ ప్రజా పంథా నాయకులు ప్రభాకర్ హాజరు అయి విలేఖర్లకు సంఘీభావం ప్రకటించారు.