Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృత్తి విద్య శిక్షణా తరగతులు ప్రారంభించిన సేవాధ్యక్షురాలు మధురవాణి
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి సేవాసమితి ద్వారా అందించే శిక్షణా తరగతులను ఉపయోగించుకొని స్వయం ఉపాధి పొందాలని సేవాధ్యక్షురాలు మధురవాణి అన్నారు. వృత్తి విద్య శిక్షణ కార్యక్రమాలలో భాగంగా గురువారం 2022- 23 సంవత్సరానికి గాను ఇల్లందులోని 24 ఏరియాలో మరియు జేకే కాలనీలో టైలరింగ్, మగ్గం వర్క్స్, బ్యూటీషియన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సేవా అధ్యక్షురాలు మధురవాణి, జి.యం.యం.షాలెం రాజు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. మూడు నెలలు నిర్వహించే శిక్షణలకు తప్పక అందరు హాజరు కావాలని, ఈ సంవత్సరం సేవాసమితి ద్వారా రెండు టైలరింగ్ కోర్సులు, ఒక్క మగ్గం కోర్స్ ఒక బ్యుటిషియన్ కోర్సు ద్వారా 100 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. జెకె ఓసి కొత్త ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం మరిన్ని శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి.జి.యం.(పర్సనల్) జి.వి.మోహన్ రావు సీనియర్ పర్సనల్ ఆఫీసర్ గుర్రం శ్రీహరి, ఎం.టి.పర్సనల్ సాయి స్వరూప్ మరియు సేవా కార్యదర్శి, సేవా సమితి సభ్యులు, శిక్షకులు పాల్గొన్నారు.