Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం
నవతెలంగాణ-కొత్తగూడెం
కొమరం భీం కాలనీలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చుంచుపల్లి మండలంలోని, కొమరం భీం కాలనిలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిని వేధిస్తున్నారన్నారు. పేదలందరికీ అండగా ఉండాలని ప్రభుత్వ అధికారులను కోరారు. పేదలను ఇబ్బందులకు గురి చేస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు, సీఐటీయూ జిల్లా నాయకులు భూక్యా రమేష్, ముక్తి రామకృష్ణ, రాంబాబు, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.