Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- టేకులపల్లి
మండలంలోని గోల్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ స్థానిక సర్పంచ్ బోడ నిరోషా మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సర్పంచ్ బోడ సరితా, టేకులపల్లి, గోల్యా తండా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, తెరాసా నాయకులు రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.