Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాప సభలో డిసిసిబి మాజీ చైర్మన్ యలమంచి రవికుమార్
నవతెలంగాణ- దుమ్ముగూడెం
మారాయిగూడెం మాజీ సర్పంచ్ అమరజీవి సోయం భద్రయ్య స్పూర్తితో ఉద్యమించాలని మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవి కుమార్ అన్నారు. బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన సోయం భద్రయ్య పార్థివదేహానికి ఎర్ర జెండా కప్పి నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం జరిగిన భద్రయ్య సంతాప సభలో ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి మారాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ గా రెండు పర్యాయాలు 10 సంవత్సరాలపాటు పని చేసి అనేక అభివృద్ధి పనులు చేపట్టాడు అన్నారు. 80 ఏళ్ల వయసు దాటినప్పటికీ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆందోళన పోరాటలలో ముందుండి పని చేసేవాడు అన్నారు. భద్రయ్య చిన్న కోడలు మామ అడుగు జాడల్లో నడుస్తూ మారాయి గూడెం పంచాయతీ వార్డు సభ్యురాలిగా పని చేస్తుందన్నారు. సోయం భద్రయ్య అమరజీవి కామ్రేడ్ బండారు చందరరావు అమరజీవి కామ్రేడ్ యలమంచి సీతరామయ్య లతో కలసి అనేక ఆందోళన పోరాటలలో పాల్గొన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు, మర్మం చంద్రయ్య, సరియం రాజమ్మ, బొల్లి సూర్యచంద్రరావు ఉపాధ్యక్షులు సోయం జోగారావు, మండల కార్యదర్శి స్థానిక సర్పంచ్ తోడం తిరుపతిరావు, పార్టీ మండల కమిటీ కూరం వీరభద్రం, మండల కమిటీ సభ్యులు సోయం నాగమణి, మాజీ సర్పంచ్లు రేసు వీరస్వామి పాల్గొన్నారు.