Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పారితోషికం
నవతెలంగాణ - దుమ్ముగూడెం
దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొండా సాయితేజ, మండలోజు యువ శ్రీ కృష్ణ సాయిలు ఈ ఏడాది జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ప్రతిభ సత్తా చాటారు. ఎంపిసి గ్రూప్లో ఆ ఇద్దరు విద్యార్థులు 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సొంతం చేసుకున్నారు. దీంతో సాయి తేజ, కృష్ణ సాయి ప్రతిభగల విద్యార్థులను ప్రభుత్వం అందించే ప్రైజ్ మనీకి ఎంపికయ్యారు. కాగా వారు గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ ఉమర్ జలీల్లు హైదరాబాద్ నాంపల్లిలోని కమిషనరేట్ నందు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి నగదు ఒక్కో విద్యార్థికి 20 వేల రూపాయలు వారి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రతీ ఏడాది అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఇటువంటి నగదు పురస్కారం ఇంటర్ బోర్డ్ అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభా పురస్కారానికి ఎంపిక అవ్వడం పట్ల జిల్లా డిఐఈఓ సులోచన రాణి, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.వెంకటేశ్వర్లు మరియు అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు.