Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 సీజ్.., నాలుగింటికి షోకాజ్ నోటీసులు
- ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
- జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ చేతన్
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలో ప్రైవేటు వైద్యశాలపై వైద్యశాఖ కొరడా ఝళిపించింది. గత పది రోజులుగా జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ చేతన్ ఆధ్వర్యంలో బృందం ప్రయివేటు వైద్యశాలలో దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించారు. సందర్శనలో భాగముగా శ్రీ ఆదిత్య మల్టిస్పెషలిటీ దంత వైద్యాశాల, శ్రీ లక్ష్మి నరసింహ దంత హాస్పిటల్ లను సందర్శించారు. ఇందులో శ్రీ ఆదిత్య మల్టిస్పెషలిటీ దంత వైద్యాశాలకు తగు సంబంధిత పత్రాలు లేకపోవుట వలన సీజ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ చేతన్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎనిమిది వైద్యశాల ను సీజ్ చేశామని,మరో నాలుగు వైద్యశాలల యజమానులకు షోకాజ్ నోటీసులు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎపిడిమియాలాజిస్ట్ అధికారి ఇమ్మానుయేల్, జిల్లా కో ఆర్డినేటర్స్ రాంప్రసాద్ మరియు భద్రు పాల్గొన్నారు.