Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్లలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయాలని వినతి
నవతెలంగాణ -చర్ల
చర్ల మండల కేంద్రంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని, నిధులు మంజూరు చేయాలని, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు గురువారం మండల పర్యవేక్షణకు వచ్చిన డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రాజ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా
మండల కార్యదర్శి కారం నరేష్ మాట్లాడారు. మండల కేంద్రంలో మెరుగైన వైద్యం అందట్లేదు అన్నారు. ప్రజావైద్యం అందనిద్రాక్షగా మారిందని అన్నారు. మండల కేంద్రంలో సరైన ప్రభుత్వ ప్రజా వైద్య శాల లేకపోవడం ఈక్రమంలో ఆర్ఎంపీలు విచ్చలవిడిగా వైద్యం చేస్తూ నిరుపేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. అలాగే వైద్య పరీక్షల పేరిట రక్త పరీక్ష కేంద్రాలు నిలువు దోపిడీ చూస్తున్నా యని అన్నారు. అధికారులు తక్షణమే ఆర్ఎం పీలపై చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి రక్త పరీక్ష కేంద్రా వద్ద ఆయా పరీక్షలకు అగు రుసుము బోర్డు రూపంలో తెలియచేసే విధంగా ఏర్పాటు చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బొల్ల వినోద్, ఆర్.కొత్తగూడెం యువకులు ఇమ్రాన్ సతీష్ పాల్గొన్నారు. వినతి పత్రం తీసుకున్న వారిలో భద్రాచలం హెచ్ఈఓ కృష్ణయ్య ఉన్నారు.