Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ-ములకలపల్లి
మండల పరిధిలోని తిమ్మంపేట రాజీవ్ నగర్ నుంచి పాతగుంగాలపాడు వరకు 8.3 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి రూ.5 కోట్లు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. గురువారం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పొగలపల్లి తిమ్మంపేట గ్రామాలలో ఆడపడుచులతో బతుకమ్మ ఆడినారు. అనంతరం గుండాలపాడు పంచాయతీ కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో రెండేళ్లపాటు రాష్ట్ర ప్రజలను రక్షించుకోవడం ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నామని, అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ మట్ల నాగమణి, ఎంపీడీవో నాగేశ్వరరావు, తహశీల్దార్ వీరభద్రరావు, ఎంపీటీసీలు నూపా సరోజిని, తాటి సునీత, తులసి, సర్పంచ్లు గొల్ల పెంటయ్య, కారం . సుధీర్, సుధాకర్, కుమారి పాల్గొన్నారు.