Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్
- వ్యకాస రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ప్రదర్శన
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని, డిసెంబర్ 5, 6, 7 తేదీలలో ఖమ్మంలో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ మహా కార్మిక ప్రదర్శనను త్రీ టౌన్ ప్రాంతంలోని గ్రేయిన్ మార్కెట్ చుట్టూ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు భూక్యా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీలో సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ దశాబ్దాల పోరాట చరిత్ర కలిగిన వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు ఖమ్మం నగరంలో జరగడం సంతోషదాయకం అన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్ ఈ మహాసభల జయప్రదానికి అన్ని వర్గాలు సహకరిస్తున్నాయని, భవిష్యత్ పోరాటాలకు వేదికగా మహాసభలు నిర్ణ యాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ప్రదర్శనలో వివిధ ప్రజా సంఘాల నాయ కులు, సిఐటియు నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, బండారు యాకయ్య, తుషాకుల లింగయ్య, వజినేపల్లి శ్రీనివాసరావు, ఎస్కే సైదులు, నండ్ర ప్రసాద్, గొడవర్తి నాగేశ్వరావు, షేక్ బషీరుద్దీన్, కొమ్ము శ్రీనివాసరావు, పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు, వేల్పుల నాగేశ్వరరావు, మద్ది సత్యం, పాశం సత్యనారాయణ, కొట్టే అలివేలు, ఉపేంద్ర, హెచ్ పీరయ్య, బుజ్జి, మీనాల మల్లికార్జున్, మండల వీరస్వామి, చంద్రకాని రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.