Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
మతోన్మాదంపై పోరాటం చేయడమే భగత్‌సింగ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని, భగత్ సింగ్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి చీర్ల చక్రి అన్నారు. గురువారం మండలంలోని మల్లేపల్లి గ్రామంలో డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డివైఎఫ్ఐ అధ్యక్షులు ఎర్రబోయిన వీరేందర్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ నేటి యువత భగత్‌సింగ్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు, వీరేందర్, ప్రతాప్, ప్రణరు, ఉపేందర్, వంశీ, మేడపల్లి శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు తెల్లమేకల మాధవరావు పాల్గొన్నారు.