Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఎస్బిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఎఫిర్తోనిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 విద్యాసంవత్సరంలో 'జరిగే మొదటి ఆన్ క్యాంపస్ డ్రైవ్ అని, విద్యార్థులు దీనిని చక్కగా ఉపయోగించుకోవాలన్నారు. గత సంవత్సరం 2750 ప్లేస్‌మెంట్‌ను అధిగ మించి ఈ సంవత్సరం మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఎఫిర్తోనిక్స్ కంపెనికి చెందిన హెచ్.ఆర్ ప్రతినిధి మాధవి మాట్లాడుతూ తమ కంపెనీ ద్వారా భారత రైల్వే సంస్థ యొక్క సిగలింగ్ అండ్ కమ్యూనికేషన్స్ రంగాలకు తమ కంపెనీ ఇంజనీర్ల సహకారం ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలియచేశారు. ప్రస్తుత ప్లేస్మెంట్ డ్రైవ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు ఎంబడెడ్ ఇంజనీర్ పోస్టులకు ప్లేస్మెంట్ నిర్వహించామని వారికి వార్షిక వేతనం 5.05 లక్షల నుంచి- 8. లక్షలుగా ఉంటుందని తెలియచేశారు. కళాశాల ప్రిన్సిపల్ డా. రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం విధ్యాభోదనే కాకుండా ఉపాధి కల్పనలో మన ఎస్బిఐటి ఇంజనీరింగ్ కళాశాల ఎల్లపుడూ ముందు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా. జి.ధాత్రి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ గంధం శ్రీనివాసరావు, ఎకడమిక్ డైరెక్టర్స్ ఎ.వి.వి. శివ ప్రసాద్, సుభాష్ చందర్, జి.ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.