Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం యాజమాన్యం, మహిళాసాధి కారత సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురా లను ఘనంగా నిర్వహించారు. కళాశాలకు చెందిన అన్ని బ్రాంచీల విద్యార్ధినులు వివిధ రంగుల పూలతో బతుకమ్మలు పేర్చి, సాంప్రదాయ గీతాలను ఆలపిస్తూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ ప్రపంచంలో పూలను పూజించే ఏకైక పండుగ మన రాష్ట్రంలో జరుపుకునే బతుకమ్మ అని తెలిపారు. ఇలాంటి వైవిధ్యమైన పండుగ జరపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. కళాశాల ప్రాంగణమంతా రంగురంగుల పూల బతుకమ్మలతో నూతన శోభను సంతరించుకుందని కొనియాడారు. అనంతరం రాజ్యసభ సభ్యులు, హెటెరో డ్రగ్స్ అధినేత, కళాశాల ఛైర్మెన్ బండి పార్థసారధిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఛైర్మెన్ బండి అన్విద వర్చువల్‌గా మాట్లాడుతూ విద్యార్ధులకు, యాజామాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ చెన్నుపాటి విజరుకుమార్, మహిళా సాధికారత సంస్థ సెక్రెటరీ సీహెచ్ లీలావతి, సభ్యులు కె.స్వాతి, ఎం.ప్రతిమ, రాచమళ్ల శ్రీదేవి, వి.సుష్మ, యన్.సుధారాణి, కె.సత్యవేణి, వివిధ విభాగాధి పతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.