Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-ఇల్లందు
స్ధానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇల్లందులో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష - 2022 నందు ఒకేషనల్ విభాగంలో మొదటి సంవత్సరం నందు విద్యార్థిని ఎస్క్ యస్మిన్ 498/500 మార్కులు సాధించింది. రాష్ట్రంలో ప్రధమ ర్యాంక్ వచ్చిన సందర్భంగా గురువారం బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో హైద్రాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్ సన్మానించి ,అభినందిస్తూ బహుమతిగా రూ 20,000/- అందచేశారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ఇంటర్ విద్య డీఈఓ సులోచన రాణి విద్యార్థి యస్మిన్ ను అభినందించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరంగం. రామలింగేశ్వర రావు, అధ్యాపకులు భాను ప్రసాద్, టీ జాన్ తదితరులు పాల్గొన్నారు.