Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత ఇంటి నిర్మాణంలా శ్రద్ధ తీసుకోవాలి
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
సొంత ఇంటి నిర్మాణానికి ఎంత శ్రద్ధ తీసుకుంటమో అదే తరహా నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తు మోడల్ పాఠశాల నిర్మాణాలు ఉండాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో మన ఊరు-మనబడి, దళితబందు కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత 368 పాఠశాలల్లో మౌలిక సౌకార్యలు కల్పనకు ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. రూ.30 లక్షల లోపు మరమ్మతులు చేపట్టేందుకు 324 పాఠశాలలను, రూ.30 లక్షలు పైబడి మరమ్మతులు అవసరమున్న 44 పాఠశాలల్లో 14 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 30 పాఠశాలల్లో పనులు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. 324 పాఠశాలల్లో 321 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని పనులను నిరంతర పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్వరలో మరో 50 పాఠశాలలు సిద్ధం చేస్తామని చెప్పారు. మరమ్మతు పనులకు ప్రత్యామ్నయంగా ఉపాధిహామి పథకం ద్వారా చేపట్టు పనులను కూడా చేపట్టాలని ఆయన సూచించారు. దళితబంధు పథకం కింద ఇల్లందులో ఒకటి. భద్రాచలం నియోజకవర్గంలో పెండింగ్ ఉన్న 9 యూనిట్లు గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. లబ్దిదారుని బ్యాంకు ఖాతాకు జమ చేసిన నిధులు తిరిగి తీసుకుంటారని చాలా మందికి అపోహ ఉన్నదని, యూనిట్ ఏర్పాటును బట్టి విడతలుగా నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీఈఓ సోమశేఖరశర్మ, దళితబంధు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వెంకటేశ్వర్లు, మరియన్న, బీమ్లా, రాంప్రసాద్, పిఆర్, వ్యవసాయ, ఐటీడీఏ, ర.భ, ఐడీసీ పర్యవేక్షక ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు. తదితరులు పాల్గొన్నారు.