Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రవి కుమార్, కల్పన
నవతెలంగాణ-ఇల్లందు
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఫలితాల బ్రాండ్‌గా సాహితి జూనియర్ కళాశాల నిలిచిందని రావూస్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రవి కుమార్-డాక్టర్ కల్పన అన్నారు. సాహితి జూనియర్ కళాశాల సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు స్వాగతకార్యక్రమమం ఫ్రెషర్స్ డేని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ స్వాగత సభకు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఉన్నతమైన విద్యను అందించడంలో విద్యా రంగంలో అపార అనుభవం ఉన్న ఎంసీ నాగిరెడ్డి నిర్మలా దేవి దంపతుల కృషి ఎంతో ఉన్నదని అన్నారు. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ అనేది చాలా ముఖ్యమైన దశ అని, చాలా జాగ్రత్తగా చదవాల్సింది ఇంటర్మీడియట్ దశలోనే అన్నారు. చదువును ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివితే ఏ విధమైన కష్టం అనిపించదని అన్నారు. తానూ ఇంత వాడిని కావడానికి సాహితీ జూనియర్ కళాశాల డైరెక్టర్ ఎంసీ నాగిరెడ్డి ప్రోత్సాహం, వారు నేర్పిన విద్యే నని డాక్టర్ రవి కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శిని హైస్కూల్ ప్రిన్సిపాల్ అర్వపల్లి రాధాకృష్ణ, సాహితి ప్రిన్సిపాల్ గుజ్జర్లపుడి రాంబాబు, వీరాస్వామి తదితరులు ప్రసంగించారు. జూనియర్ ఇంటర్లో నాలుగు వందలకు పైగా మార్కులు సాధించిన 128 మంది విద్యార్థులకు ఈ సభలో అతిధులచే మెమోంటోలను అందజేశారు. విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.