Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విప్, ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-మణుగూరు
దళితులు ఆర్ధిక సాధికారతను సాధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ప్రవేశపెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండలంలోని రామానుజరం గ్రామంలో దళిత బంధు పథకంలో మంజూరైన నిధులతో ఏర్పాటు చేసుకున్న షాప్‌లను ప్రారంభించి, మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు ఆర్దిక సుస్థిరత సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని అన్నారు. పేదల ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, నాయకులు ప్రభుదాస్, మండల పట్టణ అధ్యక్షులు ముత్యంబాబు, రామిడిరాంరెడ్డి, బొలిశెట్టి నవీన్, అడపా అప్పారావు, ధారవత్ రమా తదితరులు పాల్గొన్నారు.