Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- దుమ్ముగూడెం
మండల రైతులు దుమ్ముగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా వ్యవసాయ సాగు కోసం తీసుకున్న రుణాలను వడ్డీ కట్టి రెన్యువల్ చేయించుకోవాలని పీఏసీఎస్ అధ్యక్షులు కిలిమి ఎల్లారెడ్డి అన్నారు. శుక్రవారం పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో మహాజన సమావేశం సంఘ అధ్యక్షులు కిలిమి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ మహాజన సభ సమావేశములో సంఘం జమా ఖర్చులు ఆమోదించారు. మహాజన సమావేశములో పాలక వర్గ సభ్యులు యలమంచి శ్రీనివాసరావు, బొల్లి సూర్యచంద్రరావు, లక్ష్మీపతి రావు, పూర్ణయ్య, చలపతి, వెంకటేష్, సంఘ సీఈఓ, ముత్తయ్య సంఘ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.