Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు సూచనలు చేసిన జడ్జి చంద్రశేఖర ప్రసాద్
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ జిల్లా అధికారులతో శుక్రవారం కోఆర్డినేషన్ మీటింగ్లో పలు సూచనలు చేశారు. పోలీసు అధికారులతో మాట్లాడుతూ జైల్లో ఉన్న ఖైదీలపై క్రిమినల్ కేసులలో కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జైల్లో ఉన్న ముద్దాయిల కేసులో వాదనలు నడిచేటప్పుడు వారిని జైలు నుండి కోర్టుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. జైల్లో ఉన్న ముద్దాయిలపై నేరం మోపబడిన త్వరితగతిన ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని సూచించారు. అలాగే పోలీసు వారు పెట్టిన కేసులలో హాజరుకాని ముద్దాయిలపై వారెంట్లు చెక్కు కేసులలో పెండింగ్లో ఉన్న వారెంట్లు అమలు చేయాలని సూచించారు. కోర్టులో జరుగుతున్న రేనోవేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 2018 వరకు కేసులను డిస్పోజల్ చేయుటకు పోలీసులు చొరవ చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జి.భానుమతి, ఏ.నీరజ, బి.రామారావు, కే.దీప పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రాధాకృష్ణమూర్తి, అడిషనల్ పీపీ-పి.వి.డి లక్ష్మి, ఏపీపీలు విశ్వశాంతి, ఎన్.లావణ్య, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.జానయ్య, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆంక్షాస్ యాదవ్, భద్రాచలం ఎక్సైజ్ సీఐ ఎస్.కె రహీమున్నీసా బేగం, భద్రాచలం సబ్ జైలు సూపర్డెంట్ జే. ఉపేందర్, ఇల్లందు సబ్ జైల్ సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు.