Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వలన పూర్తిగా భూమిని కోల్పోతున్న కోరేగడ్డ భూ నిర్వాసితులకు న్యాయం చేకూర్చాలని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావును టీఆర్ఎస్ శ్రేణులు కలిసి వినతి పత్రం అందించారు. శుక్రవారం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావుల ఆధ్వర్యంలో రేగాను మణుగూరు క్యాంపు కార్యాలయంలో కలిసి రైతు కూలీలకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. మండల టిఆర్ఎస్ పార్టీ దళిత కార్యకర్తలకు దళిత బంధు వచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సమస్యలపై పట్ల సామరస్యంగా స్పందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల టౌన్ ప్రెసిడెంట్ ముమ్మినేని సత్య సంపన్, ఉద్యమ నాయకుడు పటాన్ మహబూబ్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు,కోంబతిన రాము, రావుల కిషోర్, తడికెల బుల్లెబ్బాయి, అంబోజి సతీష్, సోమరాజు, రమేష్, రాజా, గణేష్, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.