Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వానాకాలం వడ్లు కొనుగోళ్లపై ఆందోళన వద్దు
- మంత్రి పువ్వాడ, ఎంపీ నామ, ఎంఎల్ఏ కందాళ
నవతెలంగాణ- నేలకొండపల్లి
ప్రజల కష్ట సుఖాలు తెలిసిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజరు కుమార్ అన్నారు. శుక్రవారం నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార మహౌత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత నేలకొండపల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద మంత్రి పువ్వాడ, ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వర రావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు తదితరులకు టిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామ పురవీధులకుండా భారీ ర్యాలీగా బయలుదేరి వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పువ్వాడ అజరు కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే వారికి తప్పకుండా పదవులు లభిస్తాయన్నారు. వాన కాలంలో రైతులు సాగుచేసిన ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, కచ్చితంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు నుండి ప్రతి గింజ టిఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంఎల్ఏ కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతన్న శ్రేయస్సు కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండదండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డిసిఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బాలకష్ణ రెడ్డి, ఖమ్మం మేయర్ నీరజ, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, రైతుబంధు సమన్వయ సమితి మండల కన్వీనర్ శాఖమూరి సతీష్, సిడిసి చైర్మన్ నెల్లూరి లీలప్రసాద్, ఎంపిటిసి శీలం వెంకటలక్ష్మి, కార్యదర్శి వెన్నబోయిన శ్రీను, నాయకులు వజ్జా శ్రీనివాసరావు, నంబూరి సత్యనారాయణ, తన్నీరు సత్యనారాయణ, నాగుబండి శ్రీనివాసరావు, మరికంటి రేణుబాబు, వంగవీటి నాగేశ్వరరావు, గొలుసు రవి, భూక్య సుధాకర్, మందడి రాజేష్, అనగాని నరసింహారావు, వివిధ దేవాలయ కమిటీ చైర్మన్ రాయపూడి శ్రీనివాసరావు, కూరాకుల నాగేశ్వరరావు, బాజా నాగేశ్వరరావు, శ్రీనివాస సింగ్, దండా రంగయ్య తదితరులు పాల్గొన్నారు.