Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని, ప్రజల పేమెంట్ యాప్‌లకు దూరంగా ఉండి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వరాల శ్రీనివాస్ కోరారు. శుక్రవారం స్థానిక తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ ఉన్న వారే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. హామ్లోన్, పర్సనల్ లోన్స్ అంటూ ఆకర్షించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ప్రతిరోజూ చూస్తూనే ఉన్నామన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే గ్రామాలలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే 100 లేదా 9440904254 నెంబర్ల ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.