Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతులు వస్తే వికే-7 ఓసీ ఉత్పత్తి ప్రారంభం
- ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కొత్తగూడెం ఏరియా బొగ్గు ఉత్పత్తిలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు, కొత్తగూడెంలోని వికే-7 ఓసి నిర్వహణకు అటవీ, పర్యావరణ అనుమతు త్వరలో రానున్నాయని ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేష్ తెలిపారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సెప్టెంబర్ నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని, వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు, ఇతర వివరాలు తెలిపారు. కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెల కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించబడినది 8.34 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్షానికి గాను, 8.11 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 97 శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. కొత్తగూడెం ఏరియాలోని మైన్ సంస్థ వార్షిక ఉత్పత్తిలో ఎంతో భాగస్వామ్యంగా ఉంటుందని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 59.48 లక్షల టన్నులకు గాను, 53.86 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 91 శాతం ఉత్పత్తి సాదించామని తెలిపారు. సాధించిన బొగ్గు ఉత్పత్తిని వివిధ పరిశ్రమలకు రోడ్డు, రైల్ మార్గాల ద్వారా రవాణా చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ నెలలో 9.25 లక్షల టన్నులు, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 57.64 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. వికే-7 ఓసీ నిర్వహణకు పర్యావరణ అనుమతులు, అటవీశాఖ అనుమతులు త్వరలో రానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. సత్తుపల్లి ఓసీ నుండి అనుకున్న బొగ్గు ఉత్పత్తి సాధించామని, ముదస్తు వర్షాల కారణంగా ఇబ్బంది ఏర్పడినప్పటికీ ఇచ్చిన టార్గెట్ కంటే అదనంగా 50 వేల టన్నులు అధికంగా సాధించారని తెలిపారు. ఏరియాలో తరుచూ జరుగుతున్న దొంగ తనాలను అరికట్టేదిశగా చర్యలు తీసుకుంటున్నామని, సంస్థకు చెందిన వారు దొంగలకు సహకరిస్తున్నట్లు వస్తున్న ఆరోపనపై విచారణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఓటు జీఎం సీ.రమేశ్, ఏరియా ఇంజనీర్ రఘురామ రెడ్డి, ఏజిఎం సూర్యనారాయణ, డిజిఏం.(పర్సనల్) సామూయెల్ సుధాకర్, ఏరియా అధికారులు యోహాన్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్, బూర రవీందర్, పాలడుగు శ్రీనివాస్, శ్రీకాంత్, బులి మాధవ్, ప్రకాష్, శేషాశ్రీ, రామకృష్ణ, తౌర్య తదితరులు పాల్గొన్నారు.