Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
రైతు లేని రాజ్యం లేదంటూ మాటలకే పరిమితం చేస్తూ మాటల గారడీలో కార్పొరేట్ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య విమర్శించారు. మండల పరిధిలోని జానకీపురం గ్రామంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ధరణి అనే కొత్త పథకం తీసుకువచ్చి జమెందరాలును పటేల్ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని చూస్తున్నారని, పేదవాడి భూమి పట్ట మార్చుకోవాలి అంటే పట్టాధరుడుకి వారసులు మార్చుకోలేని పరిస్థితి ఉందని, పట్టదారుడు చనిపోతే గానీ కొడుకు గానీ కూతురు గానీ భూమిని మార్చుకునే పరిస్థితులు వున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటూ వ్యవసాయ మోటర్లకు కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయాలని చూస్తుందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు సాగుదారులు నుండి దరఖాస్తులు తీసుకొని సంవత్సరాలు గడుస్తున్న ఒక్కరికీ కూడా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలేదని, వెంటనే పోడు భూములు సమస్య పరస్కరించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరత్నం, నూనె కోటయ్య, వెంకన్న, అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
మండల పరిధిలోని జానకీపురం గ్రామంలో రైతు సంఘం సమావేశం జంగిలి వెంకటరత్నం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య జిల్లా కార్యదర్శి, ఆన్నవరపు సత్యనారాయణ హాజరు అయినారు. వారి సమక్షంలో అన్నపురెడ్డిపల్లి రైతు సంఘం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వీరాస్వామి, కార్యదర్శి వెంకన్న, ఉపాధ్యక్షులు నూనె కోటయ్య, సభ్యులు వెంకటేశ్వర్లు, వీరాస్వామి, రుక్మిణీ, గోపమ్మ, నాగేశ్వరావు, అప్పయ్య, సూర్యం, రాఘవులు, కృష్ణలను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులకు రాష్ట్ర జిల్లా కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య మాట్లాడారు.