Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల పక్ష సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు
నవతెలంగాణ-ఇల్లందు
బొగ్గు గనుల పుట్టినిల్లయిన ఇల్లందు నాటి పూర్వవైభవం కోసం డివిజన్ కేంద్రంగా చేయాలని అఖిల పక్ష సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయం ఏలూరు భవన్లో శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఇల్లందు రెవెన్యూ డివిజన్, కొత్త మండలాల సాధన కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, కన్వీనర్ అబ్దుల్ నబి, సీపీఐ(ఎం) నేత దేవులపల్లి యాకయ్య, సీపీఐ నేత బంధం నాగయ్య, సీపీఐ ఎమ్మెల్ ప్రజాపందా నాయిని రాజు, టీఆర్ఎస్ పీ.వీ.కృష్ణా, కాంగ్రెస్ పులి సైదులు, డానియల్, టీడీపీ చందావత్ రమేష్, బీఎస్పీ నేత గోపీనాథ్, ఆల్ ఇండియా లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు. చారిత్రాత్మకమైన ఇల్లందు ఒకప్పుడు సింగరేణి బొగ్గు గనుల వల్ల దక్షిణ భారతదేశంలో వెలుగులు విరజిమ్మిందని అన్నారు. మూలిగే నక్క పై తాటి పండు పడ్డ చందంగా తెలంగాణా ఏర్పడ్డాక 2016లో జిల్లాల పునర్విభజనతో రెండు మండలాలు మహాబాద్, ఒకటీ ఖమ్మం జిల్లాలోకి పోయి కొత్తగూడెంలో మొండెంగా నిర్జీవమైంది. ఇదీ నాటి నుండి నేటి వరకు మన ప్రజా ప్రతినిధులకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. ముఖ్య మంత్రికి ప్రాంతం అసలే పట్టదు, ఏ అవకాశమొచ్చినా సిద్దిపేట, సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్, నిజాంబాద్లకే ఇస్తారని అన్నారు. నాటి పూర్వవైభవం రావాలంటే ఇల్లందును రెవెన్యూ డివిజన్‌గా మార్చి కొమరారం, సుదిమళ్ళ, బోడులను కొత్త మండలాలుగా చేయడం అవసరం అని అన్నారు.