Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ఎల్ఐసి పాలసీదారులకు బోనస్లు పెంచాలని, జీఎస్టి రద్దు చేయాలని విప్, ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని భారతీయ జీవితా బీమా కార్యాలయంలో ధర్నాకి ముఖ్య అతిథిగా రేగా కాంతారావు పాల్గొని మాట్లాడుతూ ఏజెంట్లకి సమానమైన హక్కులను కల్పించాలన్నారు. డిమాండ్లను పరిష్కరించే విధంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొషం నరసింహారావు, మండల నాయకులు ముత్యం బాబు, అడపా అప్పారావు, యాదగిరి గౌడ్, భద్రాచలం సెక్రటరీ వీరభద్రం, నాయకులు భాగం రమేష్, నరసింహారావు, సత్యనారాయణ, కుర్షిద్ మియా, యాదగిరి, రవి సింగ్, శంకరయ్య, రమేష్,ఖలీల్, మోహన్రావు, చిట్టి శ్రీను, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.