Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డయాలసిస్ ఏర్పాటుకు భవనం పరిశీలన
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఎట్టకేలకు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో కిడ్నీ బాధితులకు వైద్యసేవలు అందనున్నాయి. నూతనంగా నియమితులైన డీసీహెచ్ఎస్ రవిబాబు శుక్రవారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట మండలం తాటి సుబ్బన్న గూడెంలోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు గురించి చర్చించారు. అనంతరం అశ్వారావుపేట చేరుకుని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో వైద్యసేవలు, ఇన్ పేషెంట్లకు అందించే సౌకర్యాలను డాక్టర్ అనుదీప్‌ను అడిగి తెలుసుకున్నారు. త్వరలో అశ్వారావుపేటలో 5 పడకలు సామర్ధ్యంతో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అదే ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన విశ్రాంతి భవనాన్ని పరిశీలించారు. ఆయన వెంట డాక్టర్ వెంకటేశ్వర్లు, జిలానీ, క్రిష్ణ, సిబ్బంది ఉన్నారు.