Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఏజెన్సీలో ఆట బాలోత్సవం విజయవంతానికి అఖిలపక్షం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వివిధ రాజకీయ పార్టీ నాయకులు తెలిపారు. భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన ఉపాధ్యాయుడు బెక్కంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరగనున్న ఆట బాలోత్సవం బ్రోచర్‌ను శుక్రవారం స్థానిక తెలంగాణ విశ్రాంతి ఉద్యోగుల భవనము నందు భద్రాద్రి అఖిలపక్షం చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతిని పొందాలని అఖిలపక్ష నాయకులు ఆకాంక్షించారు. ఏజెన్సీలో నిర్వహిస్తున్న ఆట బాలోత్సవం దేశంలో ఆదర్శంగా నిలిచి, మిగతా ప్రాంతాలు బాలోత్సవాలు నిర్వహించుకునేలా ఆట బాలోత్సవం నిలిచిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆట వ్యవస్థాపక అధ్యక్షుడు బెక్కంటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు నయుముద్దీన్, గౌరవ అధ్యక్షులు జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ నుండి బుడగం శ్రీనివాస్, భోగాల శ్రీనివాస్ రెడ్డి, తాండ్ర నరసింహారావు, నరేష్, సీపీఐ(ఎం) నుండి బాల నర్సారెడ్డి, బండారు శరత్, టీఆర్ఎస్ పార్టీ నుండి మహాలక్ష్మి, గంగాభారతి, టీడీపీ నుండి అజీమ్‌తో పాటు ఆట ఆర్గనైజర్లు పోతుల రమేష్ బాబు, జి భూషణ్ రావు, కేబీఏ ఉమాదేవి, నాగరాజు ఖమ్మం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కె ఎస్ నాయుడు, సుధాకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.ఎం.విజయనిర్మల, జి.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.