Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-తక్కువ సమయంలోనే స్కూల్ నిర్మాణం చేపట్టడం అభినందనీయం
- ఎంపీ నామ నాగేశ్వరరావు
- పాఠశాలకు రూ.7లక్షలు కట్టా కుటుంబం వితరణ
నవతెలంగాణ-కల్లూరు
విద్య, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని పోచారం గ్రామంలో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని ఎంపీ నామ నాగేశ్వరరావు జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్సీ తాత.మధు, ఎమ్మెల్యే, సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ విపి గౌతమ్‌లతో కలిసి ప్రారంభించారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టి, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. సమాజంలో అన్ని ఉన్నా విద్య లేకపోతే వెనుకబడిపోతామని, విద్యతోనే దేనినైనా జయించవచ్చనని అన్నారు. రూ. 10.50 కోట్లతో కల్లూరులో 50 పడకల ఆసుపత్రి మంజూరు అయిందని అన్నారు. ఇకపై మెరుగైన వైద్యానికి ఖమ్మం, ప్రయివేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, కల్లూరులోనే మంచి వైద్యం అందుతుందని అన్నారు. కట్టా వెంకటనర్సయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పాఠశాలకు 7 లక్షల రూపాయలు వితరణ చేయడంతో పాఠశాలకు కావలసిన ఫర్నీచర్‌ను సమకూర్చుడం జరిగిందని ఎంఎల్ఏ సండ్ర అన్నారు. ఆ కుటుంబాన్ని అభినందిం చారు. కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ పాఠశాల గ్రామంలో ఉండగా, పిల్లలు ఎస్సి కాలనీ నుండి వస్తున్నట్లు, ఎంతో ఇబ్బందిగా ఉందని దృష్టికి తేగా డిమాండ్ ఉన్న చోటుకు తరలింపునకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే మంచి స్కూల్ భవనం కట్టుకొని ప్రారంభం చేసుకుంటున్నా మన్నారు. ఈ సందర్బంగా చిన్నకోరుకొండి మర్లపాడు, తెలగారం, పోచవరం , తాళ్ళూరు వెంకటాపురం, వెన్నవల్లి, పెద్ద కోరుకొండి గ్రామాలలో అసర పెన్షన్లు సండ్ర పంపిణీ చేశారు. మర్లపాడులో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉమామహేశ్వరరావు, డిసిఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, రైతు బంధు జిల్లా కన్వీనర్ ఎన్. వేంకటేశ్వరరావు, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, ఇఇ నాగశేషు, ఎంపిపి రఘు, ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ సభ్యులు కట్టా అజరుకుమార్, రైసాసా నాయకులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, డిసిసీబీఐ డైరక్టర్ బోగోలు లక్ష్మణ్‌రావు, గ్రామ సర్పంచ్ ఎన్ అన్నపూర్ణ, సొసైటీ చైర్మన్ నరవ్వనేని అంజయ్య, సర్పంచులు నామా రాధమ్మ, ఎం.యశోద, ఎం.సుబ్బారావు, వేము రత్నమ్మ, కొండపల్లి శ్రీమన్నారాయణ, ఎంపిటీసి ఉప్పు.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.