Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్
నవతెలంగాణ- కల్లూరు
ప్రభుత్వ పరంగా చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల నిర్మాణాల్లో నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దని, నాణ్యతతోనే పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చి ఆకస్మికంగా మన ఊరు-మన బడి పనులను పరిశీలించారు. మండల కేంద్రంలో రూ. 64 లక్షల అంచనాలతో మన ఊరు -మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.3.40 కోట్లతో చేపడుతున్న నూతన స్టేడియం నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. అధికారులు పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, డిఇఓ ఎస్.యాదయ్య, పీఆర్ ఇఇ చంద్రమౌళి, మండల ప్రత్యేక అధికారి సునీత, ఎంపిడిఓ మహాలక్ష్మి, అధికారులు తదితరులు ఉన్నారు.
పని తీరు బాగుంది : కలెక్టర్
తల్లాడ : రెడ్డిగూడెం గ్రామంలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న రెండు తరగతి గదులను జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పనితీరు సంతృప్తికరంగా ఉందని, రోల్ మోడల్‌గా ఈ తరగతి గదులను తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.